తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ సందేశం..

తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ సందేశం..

'ప్రజాకూటమి తెలంగాణ ప్రజల కూటమి' అని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. ఇవాళ తెలంగాణ ఓటర్లను ఉద్దేశిస్తూ ఆమె  వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రజాకూటమే ప్రజల గొంతు వినిపిస్తుందన్నారు. నాలుగున్నరేళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటులో తన పాత్రా ఉందన్న సోనియా.. అధికారంలో ఉన్నవాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. ఇప్పుడు వేసే ప్రతి ఓటు తెలంగాణ ప్రజల భవిష్యత్ ను నిర్ధేశిస్తుందని సోనియా అభిప్రాయపడ్డారు. 'మీరు ఎన్నుకునేది మీ ఎమ్మెల్యేలను కాదు.. మీ భవిష్యత్‌ను కూడా..' అని ఆ వీడియోలో సోనియా వివరించారు.