మార్కెట్‌కు మెటల్‌ షేర్ల అండ

మార్కెట్‌కు మెటల్‌ షేర్ల అండ
షేర్‌ మార్కెట్‌ లాభాలతో ముగిసింది. ప్రధానంగా మెటల్‌ షేర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. దీంతో సూచీలు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నిఫ్టి 39 పాయింట్ల లాభంతో 10,565 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ కౌంటర్లలో భారీ మద్దతు అందడంతో మన మార్కెట్‌లో కూడా మెటల్‌ కౌంటర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నిఫ్టి షేర్లలో హిందాల్కో 9శాతం, వేదాంత 7 శాతం, టాటా స్టీల్‌ 3శాతంపైగా లాభపడ్డాయి. ఎస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ కూడా రెండు శాతంపైగా లాభాలతో ముగిశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. బీపీసీఎల్‌ 7 శాతం, హెచ్ పీసీఎల్‌ 6 శాతం, ఐఓసీ 4 శాతం వరకు నష్టపోయాయి. టైటాన్‌ రెండున్నర శాతంనష్టంతో ముగిసింది. నిఫ్టిలో ఉత్తేజం తగ్గిందని, ఇక్కడి నుంచి మార్కెట్ ఏమాత్రం పెరిగినా లాభాలు స్వీకరించాల్సిందిగా రెలిగేర్ బ్రోకింగ్‌ అధ్యక్షుడు జయంత్‌ మాంగ్లిక్‌ సలహా ఇస్తున్నారు. 10,650పైన నిఫ్టి పటిష్ఠంగా నిలబడినపుడు లాంగ్ పొజిషన్స్ తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన అన్నారు.