క‌రోనా సోకిన వ్య‌క్తితో మందు పార్టీ... చివ‌ర‌కు..!

క‌రోనా సోకిన వ్య‌క్తితో మందు పార్టీ... చివ‌ర‌కు..!

క‌రోనా ఎక్క‌డ నుంచి, ఎవ‌రి నుంచి.. ఎప్పుడు, ఎలా సోకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.. అయితే.. కరోనా వైరస్‌ను ఆషామాషీగా తీసుకుని మందు పార్టీకి వెళ్లిన యువ‌కుడు.. ఏకంగా క‌రోనా సోకిన వ్య‌క్తితో క‌లిసి మందు కొట్టాడు.. ఆ త‌ర్వాత క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు విడిచాడు.. అయితే.. చివ‌రి క్ష‌ణాల్లో అస‌లు విష‌యం చెప్పాడు.. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో మెథడిస్ట్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్. జానే ఆపిల్‌బీ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..

క‌రోనా సోకిన 30 ఏళ్ల యువ‌కుడు ప‌రిస్థితి విష‌మించి మృతిచెందాడు. అయితే.. చ‌నిపోయేముందు.. నర్సుతో అసలు విషయం చెప్పాడు.. కరోనా వైరస్ నిజమా? కాదా? అనేది పరీక్షించేందుకు బాధితుడు.. క‌రోనా సోకిన వ్యక్తితో కలిసి ఓ పార్టీకి హాజరయ్యాడు. ఆ త‌ర్వాత ఆ వైర‌స్ బారిన‌ప‌డ్డాడు.. చివ‌రిక్ష‌ణాల్లో న‌ర్సుతో మాట్లాడుతూ.. నేను తప్పు చేశాను.. కరోనా వైరస్‌ను తమాషాగా తీసుకున్నాను అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడ‌ని వెల్ల‌డించారు డాక్టర్. జానే ఆపిల్‌బీ. క‌రోనా స‌మ‌యంలో.. ఇలాంటి పార్టీలు అత్యంత ప్రమాద‌క‌ర‌మ‌ని హెచ్చరించేందుకే నేను ఈ విషయం చెబుతున్నా.. పార్టీల‌కు దూరంగా ఉండాల‌ని సూచించారు. అయితే.. రోగి వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌డానికి నిరాక‌రించారు. ఏదేమైనా.. క‌రోనాతో ఆట‌లు ఆడుదామ‌నుకుంటే.. ప్రాణాల‌కే ముప్పు మ‌రి.