#MeToo ఎఫెక్ట్ - విజయ్ హీరోయిన్ ను వేదించారట..!!

#MeToo ఎఫెక్ట్ - విజయ్ హీరోయిన్ ను వేదించారట..!!

హాలీవుడ్ లో ప్రారంభమైన మీటు ఇప్పుడు ఇండియాను గడగడలాడిస్తోంది.  బాలీవుడ్ లో భారీ ఎఫెక్ట్ చూపిస్తున్న ఈ ఉద్యమం ఇప్పుడు సౌత్ కు కూడా పాకింది.  సౌత్ లో ముఖ్యంగా కోలీవుడ్ ను మీటు ఎఫెక్ట్ ఇబ్బందులకు గురిచేస్తున్నది.  

సౌత్ ఇండియాలో విజయ్ దేవరకొండకు మంచి పేరు ఉంది.  విజయ్ దేవరకొండ టాలీవుడ్ తో పాటు తో కోలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.  ఇటీవలే నోటా అనే సినిమాలో కూడా నటించాడు.  ఇందులో యాషిక ఆనంద్ సెకండ్ హీరోయిన్.  ఈ హీరోయిన్ ను ఓ దర్శకుడు లైంగికంగా వేధింపులకు  గురి చేశాడట.  అతను ఎవరు అనే విషయాన్నీ మాత్రం బయటపెట్టడం లేదు.  

డైరెక్ట్ గా కాకుండా ఆ ఉద్దేశ్యంతోనే ఇండైరెక్ట్ గా వేధింపులకు గురి చేసినట్టుగా యాషిక పేర్కొన్నది.  అతని ప్రవర్తన నచ్చక దూరంగా ఉన్నట్టు యాషిక చెప్తున్నది.  యాషిక నోటాతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు తన చేతుల్లో ఉన్నాయి.