హైదరాబాద్‌లో మొరాయిస్తున్న మెట్రోరైల్‌ సర్వీసులు

హైదరాబాద్‌లో మొరాయిస్తున్న మెట్రోరైల్‌ సర్వీసులు

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైళ్లు సాంకేతిక కారణాలతో పదేపదే ఆగిపోతున్నాయి. కొన్ని సార్లు స్టార్ట్‌ అవడానికి మొరాయిస్తున్నాయి. నిన్న రాత్రి దుర్గంచెరువు-మాదాపూర్ మధ్య మెట్రో రైలు ఆగిపోగా..ఇవాళ ఉదయం ఎల్బీనగర్‌-మియాపూర్‌ రూట్‌లో సాంకేతిక లోపంతో రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.