అందుబాటులోకి పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్

 అందుబాటులోకి పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్

అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలోని పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్‌ శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 20న మెట్రో ప్రారంభించినా సాంకేతిక కారణాల వల్ల జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్ స్టేషన్ ప్రారంభాలను వాయిదా వేశారు. దీంతో ప్రస్తుతం ఆ స్టేషన్లలో మెట్రో ఆగడం లేదు. అయితే..శనివారం నుంచి పెద్దమ్మ గుడి స్టేషన్ అందుబాటులోకి వస్తుందని..దశలవారీగా మిగతా స్టేషన్లను కూడా ప్రారంభిస్తామని మెట్రో వర్గాలు వెల్లడించాయి.