కొరియాపై మెక్సికో విజయం

కొరియాపై మెక్సికో విజయం

కొరియాపై 2-1తో మెక్సికో విజయం సాధించింది. ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా శనివారం రోస్టోవ్ అరేనా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సంచలన మెక్సికో జట్టు దక్షిణ కొరియాపై 2-1తో విజయం సాధించి గ్రూప్‌ ‘ఎఫ్‌’లో వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీపై విజయం సాధించింది. గ్రూప్‌  ‘ఎఫ్‌’లో రెండు పరాజయాలతో దక్షిణ కొరియా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే 6 పాయింట్లతో మెక్సికో నాకౌట్‌ రేసులో ముందంజలో ఉంది.

ఆట ప్రారంభంలో దక్షిణ కొరియా జట్టు మెక్సికోకు ధీటుగా ఆడింది. ఈ క్రమంలో మెక్సికో జట్టు బంతిని ఆధీనంలోకి తీసుకుంది. ఇక 26 నిమిషంలో జాంగ్‌ హ్యున్‌సూ చేతికి బంతి తగలడంతో మెక్సికో జట్టుకు పెనాల్టీ దక్కింది. వచ్చిన అవకాశమును కార్లొస్‌ వెలా గోల్‌గా మలిచాడు. ఇక్కడి నుంచి మెక్సికో ఆధిపత్యమే సాగింది. మధ్యలో కొరియాకు గోల్ చేసే అవకాశం వచ్చినా జట్టు విఫలమయింది. దీంతో మెక్సికో 1-0తో మొదటి భాగంను పూర్తి చేసింది. ఆట రెండో భాగం ప్రారంభంలో మెక్సికో జట్టు బంతిని తన ఆధీనంలో ఉంచుకుంటూ దక్షిణ కొరియాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 66వ నిమిషంలో లొజానో అందించిన పాస్‌ను హెర్నాండెజ్‌ లాఘవంగా బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో మెక్సికో ఆధిక్యం 2–0కు చేరింది. ఇక 90వ నిమిషంలో పెనాల్టీ ఏరియా బయట బంతిని అందుకున్న ఇంజ్యూరీలో సన్‌ గోల్‌ చేశాడు. అయితే ఆట  సమయం అయిపోవడంతో దక్షిణ కొరియా 2-1తో ఓటమి చవిచూసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేవియర్‌ హెర్నాండెజ్‌కు దక్కింది.  

Photo: FileShot