ఎంజి హెక్టర్: దేశంలోనే మొదటి ఇంటర్నెట్ ఎస్ యువి!

ఎంజి హెక్టర్: దేశంలోనే మొదటి ఇంటర్నెట్ ఎస్ యువి!

బ్రిటన్ కి చెందిన ప్రముఖ వాహన నిర్మాణ సంస్థ మోరిస్ గారేజ్ (ఎంజి) తన ఎంతో కాలంగా ఊరిస్తున్న ఎస్ యువి ఎంజి హెక్టర్ ను ప్రదర్శించింది. దీని బుకింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆ తర్వాత దీని అమ్మకాలు కూడా ప్రారంభిస్తుంది. ఇది దేశంలోనే మొదటి ఇంటర్నెట్ ఎస్ యువి. ఇందులో కంపెనీ 100కి పైగా కనెక్టివిటీ ఫీచర్లు ఇస్తోంది.

కొత్త ఎంజి హెక్టర్ ని కంపెనీ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇందులో 48వోల్టుల హైబ్రిడ్ పవర్ ట్రెన్ ను కూడా ఉపయోగించడం జరిగింది. కంపెనీ దీని పెట్రోల్ వేరియంట్ లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, డ్యుయల్ క్లచ్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ ఇస్తోంది. డీజిల్ వేరియంట్ లో కంపెనీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ అమర్చింది. 

హెక్టర్ పెట్రోల్ వేరియంట్ లో 1.5 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది ఎస్ యువికి 143 బీహెచ్ పి పవర్, 250ఎన్ఎం టార్క్ అందిస్తుంది. దీని డీజిల్ వేరియంట్ లో 2.0 లీటర్ సామర్థ్యం గల డీజిల్ ఇంజన్ ఇచ్చారు. ఇది 170 బీహెచ్ పి పవర్, 350ఎన్ఎం టార్క్ జెనరేట్ చేస్తుంది. ఇవే కాకుండా సెగ్మెంట్ లో మొదటిసారి దీని పెట్రోల్ వేరియంట్ లో 48వోల్టుల మాయిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ని ఉపయోగించారు.

ఇది ఒక ఇంటర్నెట్ ఎస్ యువి. ఇందులో కంపెనీ ఇన్ బిల్ట్ సిమ్ కార్డ్ అమర్చింది. దీంతో మీరు ఎస్ యువిని మీ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో సెగ్మెంట్ లో మొదటగా ఈఎస్పీ+ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ డిస్క్ బ్రేక్, ISOFIX చైల్డ్ సీట్ వంటి ఫీచర్లను స్టాండర్డ్ గా ఏర్పాటు చేసింది. ఇవి కాకుండా ఇందులో 10.4 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఈ ఎస్ యువిలో కంపెనీ 587 లీటర్ బూట్ స్పేస్ ఇచ్చింది. ఇది ఈ సెగ్మెంట్ లోనే అతిపెద్దది.