వచ్చేస్తోంది ఎంఐ ఫ్యాన్‌ ఫెస్టివల్‌..

వచ్చేస్తోంది ఎంఐ ఫ్యాన్‌ ఫెస్టివల్‌..

తమ కస్టమర్ల కోసం మరోసారి బంపర్ ఆఫర్లు తీసుకొస్తోంది ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.. ‘ఎంఐ ఫ్యాన్‌ ఫెస్టివల్‌ 2019’ పేరుతో ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు షియోమీ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆన్‌ లైన్‌ లో ఎంఐ.కాం,  ఆఫ్‌ లైన్‌ లో ఎంఐ హోం, ఎంఐ స్టోర‍్లలో ఈ సేల్‌ ఉంటుంది. షియోమీ లేటెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్లపై రూ. 9వేల దాకా తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ‘ఫన్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్‌లను ఆడటం ద్వారా రెడ్‌మి నోట్‌ 7, ఎంఐ స్పోర్ట్స్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు రెడ్‌మి నోట్‌ 7ప్రో, పోకో ఎఫ్‌1, ఎంఐ సౌండ్‌బార్‌, ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రో తదితర ఉత్పతులను రూ.1 ఫ్లాష్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. షియోమీ రెడ్‌మి 6 3జీబీ+32జీబీ మోడల్‌పై రూ.2000 డిస్కౌంట్‌ లభిస్తుండగా, రూ.6,999లకే లభించనుంది. షామీ రెడ్‌మి వై2 3జీబీ వేరియంట్ రూ.7,999, షామీ రెడ్‌మి వై2 4జీబీ వేరియంట్‌ 9,999కే లభించనుంది. రెడ్‌మి నోట్‌ 6ప్రో 3జీబీ రూ.7,999, రెడ్‌మి నోట్‌ 6ప్రో 4జీబీ రూ.7,999, రెడ్‌మి నోట్‌5ప్రో 4జీబీ+64జీబీ మోడల్‌ను రూ.10,999కే సొంతం చేసుకునే అవకాశం ఇచ్చింది సంస్థ.