పంజాబ్ లక్ష్యం 187

పంజాబ్ లక్ష్యం 187

ఐపీఎల్-11లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో ఓపెనర్ ఎవిన్ లివీస్(9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆరో ఓవర్‌లో ఊపుమీదున్న  ఇశాన్ కిషన్(20), సూర్యకుమార్ యాదవ్(27)లు వరుస బంతుల్లో అవుట్ అయ్యారు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(6) భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు. నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో పొలార్డ్, కృనాల్‌ల జోడీ జట్టును ఆదుకుంది. వీరిద్దరు కలిసి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం కృనాల్(32) అవుట్ అయ్యాడు. ఈ సమయంలో పొలార్డ్ (50; 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) ఆదుకున్నాడు. ఆ తర్వాత పొలార్డ్, కట్టింగ్(4), హార్థిక్(9) స్వల్ప తేడాతో పెవిలియన్ చేరారు. చివరలో మెక్‌క్లాగాన్(11) పరుగులు చేయడంతో 186 పరుగులు చేసి.. పంజాబ్ ముందు 187 పరుగుల లక్షంను ఉంచింది. పంజాబ్ బౌలర్లలో టై 4, అశ్విన్ 2 వికెట్లు తీశారు.