ఎంఐ ఏ2 వచ్చేస్తోంది

ఎంఐ ఏ2 వచ్చేస్తోంది

దేశీయ మొబైల్ మార్కెట్ ని దున్నేస్తున్న చైనా దిగ్గజ సంస్థ షియోమీ త్వరలోనే మరో సూపర్ ఫోన్ తో ముందుకొచ్చేస్తోంది. చైనాలో ఎంఐ 6ఎక్స్ గా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో ఎంఐ ఏ2గా విడుదల చేస్తోంది షియోమీ. భారత్ లో ఈ ఫోన్ ని జూన్ 20న విడుదల చేస్తారని తెలుస్తోంది. ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను ఎంఐ2లో పొందుపరచారు. వీటిలో ముఖ్యమైన వాటిని ఓ సారి చూద్దాం.

  • ఎంఐ ఏ2 వెనక వైపు 12ఎంపీ, 20 ఎంపీ సామర్థ్యం ఉన్న డ్యూయల్ కెమెరా అమర్చారు. వీటికి ఉన్న డ్యూయల్ లెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 12 రకాల సీన్లను గుర్తిస్తుంది. దీంతో యూజర్లు చక్కని ఫోటోలు, వీడియోలు తీయడం సాధ్యమవుతుంది. 
  • ఏ2 శక్తివంతమైన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తోంది. దీంతో సీపీయూ, గ్రాఫిక్స్ పెర్ఫామెన్స్ మెరుగవుతాయి.
  • ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఏఐ స్మార్ట్ బ్యూటీ 4.0, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యాక్ గ్రౌండ్ బ్లర్ సాయంతో చక్కటి సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇందులోని 4500కె సాఫ్ట్ ఎల్ఈడీ లైట్ సాయంతో వెలుతురు తక్కువగా ఉన్నపుడు కూడా సెల్ఫీలు తీయడం వీలవుతుంది.
  • ఎంఐ ఏ2లో చెప్పుకోవాల్సిన మరో కీలక అంశం 5.99 అంగుళాల స్క్రీన్ లో 18:9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే వస్తుంది. ఇది 1080 X 2160 ఫుల్ హెచ్ డీ, 1500:1 స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో ఉంటాయి. కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ మెంట్ ఉండటం ఏ2 మరో ప్రత్యేకత. 
  • ఎంఐ ఏ2లో సాఫ్ట్ వేర్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇది పని చేస్తుంది. ఆండ్రాయిడ్ వన్ ఉన్నందువల్ల ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్ డేట్ అవుతుంది.

ఎంఐ ఏ2 ఫోన్ రెండు వేరియంట్లలో రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ. 14,999గా ఉండొచ్చని భావిస్తున్నారు. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.17,999గా నిర్ణయించవచ్చని తెలుస్తోంది.