కోల్‌కతా లక్ష్యం 182...

కోల్‌కతా లక్ష్యం 182...

ఐపీఎల్-11లో భాగంగా ఈ రోజు వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో ముంబై 181 భారీ పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 182పరుగుల  భారీ లక్ష్యఛేదనను ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లివీస్, సూర్య కుమార్‌ల జోడీ తొలి వికెట్‌కి 91 పరుగులు జోడించారు. లివీస్(43)  రస్సెల్ కి చిక్కగా.. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ(11) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్(39 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సులు) బ్యాట్ జులిపించాడు. ధాటిగా ఆడే  ప్రయత్నంలో రస్సెల్ కి దొరికిపోయాడు. చివరలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా (20 బంతుల్లో 35; 4 ఫోర్లు 1 సిక్సు ) చెలరేగడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.  కోల్‌కతా బౌలర్లలో రస్సెల్, నరైన్ చెరో రెండు వికెట్లు తీశారు.