2 కోట్లకే ఐపీఎల్‌ లో స్మిత్‌ ఆడకపోవచ్చు : క్లార్క్‌

2 కోట్లకే ఐపీఎల్‌ లో స్మిత్‌ ఆడకపోవచ్చు : క్లార్క్‌

ఐపీఎల్ వేలంలో తక్కువ ధరకు పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. ఈ ఏడాది లీగ్‌లో ఆడకపోవచ్చన్నారు ఆ దేశ మాజీ క్రికెటర్‌ మైకేల్ క్లార్క్‌. గతేడాది రాజస్థాన్‌ రాయల్స్‌ కు కెప్టెన్‌గా వ్యవహరించిన స్మిత్‌ 12 కోట్ల 50 లక్షలు పలికాడు. కానీ ఈ ఏడాది అతను పెద్దగా ఫాంలో లేకపోవడంతో అతన్ని రాజస్థాన్‌ రాయల్స్ వదులుకుంది. దీంతో అతన్ని ఎవరు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో.. ఢిల్లీ క్యాపిటల్‌ 2 కోట్ల 20 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. అయితే 2 కోట్లు తీసుకుని స్మిత్‌ ఆడతాడని తాను అనుకోవడం లేదని  క్లార్క్ అన్నాడు‌. చూడాలి మరి ఈ విషయం పై స్మిత్ ఎలా స్పందిస్తాడు అనేది.