నా సలహా వల్ల ధోని ఔట్ అయ్యాడు.. అప్పుడు నా దగ్గరకు వచ్చి..?

నా సలహా వల్ల ధోని ఔట్ అయ్యాడు.. అప్పుడు నా దగ్గరకు వచ్చి..?

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ అయిన మైఖేల్ హస్సీ తాను ఇచ్చిన ఓ సలహా కారణంగా ధోని ఒక్కసారి ఔట్ అయ్యాడని దాంతో ధోనికి కోపం వచ్చింది అని తెలిపాడు. ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో హస్సీ మాట్లాడుతూ... ఐపీఎల్ 2018 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌ను ఎలా ఎదుర్కోవాలో ధోనికి ఒక సలహా ఇచ్చాను అని అన్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో రషీద్ ను ఎదుర్కుంటున్న ధోని నా సలహా ప్రకారం ఆడుతున్నాడు. అప్పుడు నేను అక్కడే కూర్చొని అతని ఆట చూస్తునాను. అయితే అదే ఓవర్లో రషీద్ వేసిన బంతికి ధోని ఔట్ అయ్యాడు. అప్పుడు అతను బయటకు నేరుగా నా దగ్గరకు నడుస్తూ వచ్చి కోపంగా 'నేను నా సొంత మార్గంలో బ్యాటింగ్ చేస్తాను, ధన్యవాదాలు' అని చెప్పి కూర్చున్నాడు అంటూ మైఖేల్ హస్సీ పేర్కొన్నాడు. కానీ ఆ మ్యాచ్ల్లో చెన్నై విజయం సాధించి ఫైనల్ కు వెళ్తుంది. అయితే మళ్ళీ ఫైనల్లో కూడా సన్‌రైజర్స్ పై గెలిచి టైటిల్ అందుకుంది.