భారత్ విజయం నా ముఖంపై గుడ్లతో కొట్టినట్లుగా ఉంది...

భారత్ విజయం నా ముఖంపై గుడ్లతో కొట్టినట్లుగా ఉంది...

ఐపీఎల్ తర్వాత నేరుగా ఆసీస్ పర్యాటకు వెళ్లిన భారత టెస్ట్ సెరోస్ లో భాగంగా అడిలైడ్ వేధిలాగా జరిగిన మొదటి పింక్ టెట్ లో ఘోర పరాజయం తర్వాత భారత్ 4-0తో క్లీన్ స్వీప్ అవుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నారు. ఓ వైపు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఆసీస్ జట్టులోకి రాగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద సిరీస్ నుంచి తప్పుకోవడం.. అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడటంతో వాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌పై గెలవడం కాదు వారికీ... గట్టి పోటినిస్తే చాలని మాట్లాడాడు. మైఖేల్ వానే కాదు ఆసీస్ మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేసారు. కానీ కోహ్లీ తర్వాత సారథ్య బాధ్యతలు అందుకున్న రహనే జట్టును అద్భుతంగా నడిపించాడు. ముందుగా మెల్‌బోర్న్ టెస్ట్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో విజయాన్నందించి సిరీస్‌ ను సమం చేసాడు. ఆ తర్వాత అశ్విన్- విహారీ అసాధారణ పోరాటంతో సిడ్నీ టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్.. యువ ఆటగాళ్ల సాయంతో ఆసీస్ గబ్బా కోటను బద్దలు కొట్టి 2-1తో సిరీస్‌నే కైవసం చేసుకుంది. దీంతో మైఖెల్ వాన్, ఆసీస్ మాజీ క్రికెటర్లపై భారత అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా దీనిపై స్పందించిన మైఖేల్ వాన్.. భారత్ చారిత్రాత్మక విజయం తన ముఖంపై గుడ్లతో కొట్టినట్లుగా ఉందని పేర్కొన్నాడు. అయితే భారత్ విజయాన్ని ఆ దేశ అభిమానులు కూడా ఊహించలేదని, ఇక తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనన్నాడు.