మైఖెల్ వాగన్‌ను బ్లాక్ చేసిన మంజ్రేకర్

మైఖెల్ వాగన్‌ను బ్లాక్ చేసిన మంజ్రేకర్

భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ వరల్డ్ కప్ టోర్నీలో వివాదాంశంగా మారారు.  సొంత దేశం టీమ్ ఇండియా జట్టుపైనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం భారత క్రికెట్ అభిమానులకు కూడా నచ్చట్లేదు.  అలాగే ఇతర దేశాలకు చెందిన క్రికెట్ ప్రముఖులు కూడా ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. 

భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాపై మంజ్రేకర్ చేసిన కామెంట్స్ పట్ల గతంలోనే రియాక్ట్ అయిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాగన్‌ మరోసారి ఇండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ సందర్బంగా మరోసారి స్పందిస్తూ మంజ్రేకర్ జడేజాను పొగడటాన్ని ఉద్దేశించి యూటర్న్ తీసుకున్న మాజీ ఓపెనర్ అంతో ట్రోల్ చేశారు. దీంతో మంజ్రేకర్ వాగన్‌ను ట్విట్టర్లో బ్లాక చేశారు.  వాగన్ దీన్ని కూడా బ్రేకింగ్ న్యూస్.. మంజ్రేకర్ నన్ను బ్లాక చేశాడు అంటూ ట్రోల్ చేశారు.