రూ. 4,999లకే.. మైక్రోమ్యాక్స్ ఐవన్ స్మార్ట్ ఫోన్

రూ. 4,999లకే.. మైక్రోమ్యాక్స్ ఐవన్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ దేశీయ మొబైల్స్ త‌యారీదారు మైక్రోమ్యాక్స్ నూత‌న స్మార్ట్‌ఫోన్ ను విడుద‌ల చేసింది. 'మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌' స్మార్ట్ ఫోన్ ను రూ.4,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు అందిస్తున్నట్లు మైక్రోమ్యాక్స్ ప్రకటించింది. 

మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ ఫీచ‌ర్లు...

* 5.45 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 1132 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్
* 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* 4జీ, బ్లూటూత్ 4.2
* 2200 ఎంఏహెచ్ బ్యాట‌రీ