ఏపీ రైతులకు సత్య నాదెళ్ల సతీమణి భారీ సాయం... 

ఏపీ రైతులకు సత్య నాదెళ్ల సతీమణి భారీ సాయం... 

లాక్ డౌన్ కాలంలో ప్రాణాలు అనేక ఇబ్బందులు పడ్డారు.  రైతు కూలీలు, వలస కూలీల బాధలు వర్ణణాతీతం.  సడెన్ గా లాక్ డౌన్ ను ప్రకటించడంతో ఎక్కడి వ్యక్తులు అక్కడే ఆగిపోయారు.  దీంతో దేశంలోనే లక్షలాదిమంది తిండిలేక ఇబ్బందులు పడ్డారు.  సాయం అందించేవారు ముందుకు వచ్చినా అది అరకొర మాత్రమే అని చెప్పాలి. 

అనేకమంది దాతలు ముందుకు వచ్చి చేతనైనా సాయం అందిస్తున్నారు.  తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రైతు కూలీలను ఆదుకోవడానికి రూ. 2 కోట్ల రూపాయల సాయం అందించారు.  ఆనంతపురంలోని యాక్షన్ ప్రేటార్నా ఎకాలజి సెంటర్ కు ఈ విరాళం అందించారు.  సత్యనాదెళ్ళ సతీమణి అనుపమ అందించిన సాయంతో రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏఎఫ్ ఎకాలజి సెంటర్ డైరెక్టర్ తెలిపారు.