మోడీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి 

మోడీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి 

భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పాంపియో నిన్న భారత్‌ వచ్చారు. ఉగ్రవాదం, హెచ్-1బీ వీసా, ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలతో భారత్‌లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై వీరు చర్చించినట్టు తెలిసింది. ఇక.. ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో భారత, అమెరికా వాణిజ్యవేత్తలతో పాంపియో ఇవాళ భేటీ అవుతారు.