మొహర్రం ఎఫెక్ట్‌: లీటరు పాలు రూ.140..!

మొహర్రం ఎఫెక్ట్‌: లీటరు పాలు రూ.140..!

మొహర్రం సందర్భంగా పాలు ధర భగ్గుమంది.. ఏకంగా సెంచరీ దాటేసింది.. అంతటితో ఆగలేదు.. పెట్రోల్, డీజిల్ ధరలను క్రాస్ చేసింది.. చివరకు లీటరు పెట్రోల్ ధర రూ.140గా పలికింది. ఇది ఎక్కడో అనుకుంటున్నారా.. అదే మన దాయాది దేశం పాకిస్థాన్‌లో. మొహర్రం సందర్భంగా పాక్‌లోని ముఖ్యమైన నగరాలైన ఇస్లామాబాద్, కరాచి లాంటి నగరాల్లో పాల ధర లీటర్‌కు రూ. 120 నుంచి రూ. 140 వరకు పలికింది. అయితే, సాధారణంగా మొహర్రం రోజు పాలకు డిమాండ్ ఉండడంతో ధరలు పెరుగుతాయి. కానీ, ఎప్పుడు లేని విధంగా ఈసారి పాల ధర పెరిగిపోయిందంటున్నారు. ఇక, పాకిస్థాన్‌లో మనతో పోల్చుకుంటే ఎక్కువే.. లీటర్ పెట్రోల్ ధర రూ. 113 పలుకుతుండగా.. డీజిల్ రూ.91గా ఉంది. మొత్తానికి ఈ ఏడాది మొహర్రం సందర్భంగా పాల ధరలు పెట్రో ధరలను అధిగమించాయి.