కేసీఆర్ ఔదార్యం, కలెక్టర్ స్పందన... ఒవైసీ ఫిదా..!

కేసీఆర్ ఔదార్యం, కలెక్టర్ స్పందన... ఒవైసీ ఫిదా..!

తాజాగా రోడ్డుపై ఉన్న ఓ వృద్ధుడి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఔదార్యం చూపిన సంగతి తెలిసిందే.. టోలీచౌక్‌లో వికలాంగుడైన సలీమ్ అనే వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించడంతో.. వెంటనే కారు దిగిన సీఎం కేసీఆర్.. ఆయన సమస్య గురించి ఆరా తీయడమే కాదు.. హామీ ఇచ్చారు.. వెంటనే అధికారులను ఇంటికి పంపించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం.. వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిపోయాయి. మరోవైపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ వృద్ధురాలి కష్టం తెలుసుకొని వెంటనే పరిష్కరించారు.. ఆమెతో పాటు మెట్లపై కూర్చొని.. ఆ పెద్దమ్మతో మాట్లాడి సమస్య పరిష్కరించారు కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌... ఇక, సీఎం కేసీఆర్.. ఆ వృద్ధుడి పట్ల చూపించిన ప్రేమకు, కలెక్టర్ ఓ పెద్దమ్మ సమస్యపై స్పందించిన తీరుకు ఫిదా అయిపోయారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ... ఈ ఘటనలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒవై.. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఇది మంచి మార్గం, వినయం చూపిస్తోందని ప్రశంసలు కురిపించారు. సీఎంలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలే అనేదానికి ఇవి మంచి ఉదాహరణగా అభివర్ణించారు ఒవైసీ.