నామినేషన్ వేసిన ఒవైసీ

నామినేషన్ వేసిన ఒవైసీ

 తెలంగాణలో ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయింది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి మాణిక్‌రాజ్‌ కన్నన్‌కు ఒవైసీ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఒవైసీ భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. ర్యాలీలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓవైసీ పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.