ఓవైసీ ఆస్తుల విలువ 13 కోట్లు...

ఓవైసీ ఆస్తుల విలువ 13 కోట్లు...

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ సోమవారం హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్‌ సమయంలో 13 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అసదుద్దీన్‌ ఓవైసీ అఫిడవిట్లో చూపించారు. రూ .12 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 1.67 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఓవైసీ తన పేరుమీద ఒక్క మోటారు వాహనం కూడా చూపలేదు. కానీ రెండు లక్షల రూపాయల విలువైన రెండు తుపాకీలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఓవైసీ దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయని తెలిపారు. 2017-18లో ఓవైసీ ఆదాయం రూ .10,01,080లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. 2016-17లో ఆదాయం 13,33,250 రూపాయలట. ఇక ఓవైసీపై ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.