బెంగాల్ బరిలో తెలంగాణా పార్టీ..!!

బెంగాల్ బరిలో తెలంగాణా పార్టీ..!!

పశ్చిమ బెంగాల్ కు మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఎలాగైనా మరోసారి గెలిచి బెంగాల్ కోటను కాపాడుకోవాలని మమతా బెనర్జీ చూస్తుంటే.. బెంగాల్ కోటను బద్దలు కొట్టి అక్కడ కాషాయం జెండా ఎగరేయాలని బీజేపీ చూస్తున్నది.  ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి.  మాటల యుద్ధం మొదలుపెట్టి.. చేతల యుద్ధం వరకు ఏదో ఒక చోట జరుగుతున్నది.  

వచ్చే ఎన్నికలు ఈ రెండు పార్టీల మధ్యనే అన్నట్టుగా ఉన్న సమయంలో మూడో పార్టీ ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.  అదే మజ్లీస్ పార్టీ.  తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో ఎక్కువ బలంగా ఉన్న ఈ పార్టీ బెంగాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యింది.  వచ్చే బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి ట్వీట్ చేశాడు. మేము మమతా బెనర్జీకి మిత్రులుగా ఉండమని అనుకుంటున్నాం.  మిత్రుత్వంతో పోటీలోకి దిగబోతున్నాం.  పార్టీకి అక్కడ క్యాడర్ లేదు.  కార్యకర్తలు లేరు.  అయినా భయం లేదు.  మీరు మమ్మల్ని మిత్రులుగా భావించినా లేదా శత్రువులని అనుకున్నా పర్వాలేదు.  పోటీ చేయడం ఖాయం అని ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.