మినీ మేడారం జాతర తేదీలు ప్రకటన

మినీ మేడారం జాతర తేదీలు ప్రకటన

ములుగు జిల్లాలోని మినీ మేడారం జాతర తేదీలను పూజారులు  ప్రకటించారు.  ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు పూజారులు. మండామేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  2 సంవత్సరాల ఒకసారి జరిగే జాతర మేడారం సమ్మక్క సరాలమ్మ జాతర.  పూజరుల సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది మండమేలిగే పండగ సందర్భంగా సమ్మక్క, సరాలమ్మ పూజారులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  ఫిబ్రవరి 24 బుధవారం  గుడిశుద్ధి, పూజాకార్యక్రమాలు, ఇదేరోజు ఉదయం గ్రామ నిర్భంధన జరుగనుంది. 25 గురువారం సమ్మక్క, సారాలమ్మ లకు పసుపు, కుంకుమ లతో అర్చన జరుగనుండగా... 26 శుక్రవారం భక్తులు అమ్మవార్లను భక్తులు దర్శించుకోనున్నారు. 27 శనివారం అమ్మవార్ల పూజ కార్యక్రమాలు ముగింపుతో మినీ జాతర ముగుస్తుంది. మినీ మేడారం మండమేలిగే పండుగ సందర్భంగా అమ్మవార్ల గద్దెపైకి రారని ప్రధాన పూజారి పేర్కొన్నారు.