ఆటో డ్రైవర్ అవతారంలో ఏపీ మంత్రి 

ఆటో డ్రైవర్ అవతారంలో ఏపీ మంత్రి 

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆటో డ్రైవర్ అవతారంలో దర్శనమిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి టెక్కలి వరకు జాతీయ రహదారిపై సుమారు 30 కిలోమీటర్లు స్వయంగా ఆటోను నడిపారు. ఇటీవల ఆటో డ్రైవర్లకు అండగా టాక్స్‌ను రద్దు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతుగా శ్రీకాకుళంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో నడుపుతూ టెక్కలి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు అనంతరం జరిగిన జయహో బీసీ సదస్సులో పాల్గొన్నారు.