అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ఒకే ఫీజు..!

అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ఒకే ఫీజు..!

రాష్ట్రంలో అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ఒకే ఫీజు ఉండాల్సిందేనన్నారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్... అమరావతిలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు మంత్రి... ఈ సమావేశానికి ఉన్నతవిద్యాశాఖ అధికారులు, కళాశాలల యాజమాన్యాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకే ఫీజు అంశాన్ని ప్రస్తావించారు మంత్రి ఆదిమూలపు సురేష్... రూ. 35 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా ఉన్న ఫీజుల్లో మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో.. కళాశాలల యాజమాన్యాల ముందు ఈ ప్రతిపాదనలు ఉంచారు. దీంతో, ఫీజులపై స్పష్టత రావడానికి మరో వారం రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫీజులపై క్లారిటీ వచ్చిన తర్వాతే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని భావిస్తోంది ప్రభుత్వం.