టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది

టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది

చిత్తూరులో మంత్రి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని, ప్రజలు తమ ఓటు హక్కును యుద్దం చేసి మరి వినియోగించుకున్నారని అన్నారు.  తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఇరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారు.. అందుకే కేసీఆర్ గెలిచారు.  కానీ ఎలక్షన్ కమీషన్ సారీతో సరిపుచ్చుకుందని విమర్శించారు.  ఏపీలో చాలా ఈవీఎంలు పనిచేయలేదన్న ఆయన 'ఘర్షణలు సృష్టించి జనాన్ని భయపెట్టాలని అనుకున్నారు.  పోలీసులు కూడా వైకాప సహకరించారు.  కానీ ఓటర్లు చైతన్యంతో బయటి రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఓట్లు వేశారు.  సంక్షేమ పథకాలు, అభివృది కార్యక్రమాలు, రాజధాని అంశాలతో తెలుగుదేశం భారీ మెజార్టీ తో గెలవనుంది' అన్నారు.