రాముడు ముందు పుట్టాడా..?.బీజేపీ ముందుపుట్టిందా..? : మంత్రి అవంతి

రాముడు ముందు పుట్టాడా..?.బీజేపీ ముందుపుట్టిందా..? : మంత్రి అవంతి

బీజేపీ రథయాత్ర నిర్ణయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.  రాష్ట్ర ప్రయోజనాల కంటే... మతతత్వ, మూస విధానాలనే చర్చించడం బాధాకరమన్నారు. బీజేపీ రెండు రకాలుగా విడిపోయిందని... ఆర్.ఎస్.ఎస్.భావజాలంతో పనిచేసే పాత బీజేపీ ఒకటైతే....చంద్రబాబు మనుషులతో నిండిన కొత్త బీజేపీ మరొకటి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త బీజేపీ ట్రాప్ లో పడవద్దని సోమువీర్రాజును కోరుతున్నానని... బీజేపీ రథయాత్ర వెనుక అజెండా ఏంటి...? అని ప్రశ్నించారు.  రాముడు ముందు పుట్టాడా..?.బీజేపీ ముందుపుట్టిందా..? రాముడు అందరివాడు..మా దైనందిన జీవితం రాముడి జపంతోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇతర మతాలను గౌరవించే వారు హిందువులు కారా...!? రాముడు మీ ఒక్కడికే దేవుడా అని ప్రశ్నించారు. దేవాలయాల పునరుద్ధరణ కోసం నిధులు కేటాయిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదని... రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బీజేపీలు అమాయకులుగా భావిస్తున్నాయని పేర్కొన్నారు.  విశాఖ రైల్వేజోన్ ప్రకటన చేసి ఎందుకు వదిలేశారని... కర్నూల్ న్యాయ రాజధానికి బీజేపీ అనుకులమో...వ్యతిరేకమో చెప్పాలని నిలదీశారు. మత, కుల, సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని... డీజీపీకి మతాన్ని అంట గట్టడం...డెడ్ లైన్లు పెట్టడం సరైన విధానం కాదని ఫైర్‌ అయ్యారు. సోషల్ మీడియా పోస్టింగ్ లపై కేసులు పెట్టొద్దని చెప్తున్న బీజేపీ నాయకులు ఆ మేరకు పార్లమెంట్ లో చట్టం చేయించగలుగుతారా..!? అని ప్రశ్నించారు.  కాంగ్రెస్, బీజేపీలో దక్షిణాదిపై చిన్న చూపు ఉందని... ఆ వైఖరిని బీజేపీ విడనాడాలని పేర్కొన్నారు.