కేటీఆర్‌కు అఖిలప్రియ ఆహ్వానం...

కేటీఆర్‌కు అఖిలప్రియ ఆహ్వానం...

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి భూమా అఖిలప్రియ కలిశారు. తన పెళ్లికి రావాల్సిందిగా.. కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. అనంతరం మంత్రి అఖిలప్రియ, భార్గవ్‌లకు మంత్రి కేటీఆర్ జ్ఞాపికను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత భూమా శోభా నాగిరెడ్డి, తాను 2009-2014 మధ్య కాలంలో ఎమ్మెల్యేలుగా పనిచేశామని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 29న మంత్రి భూమా అఖిలప్రియ వివాహం జరగనుంది.