డిసెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు..

డిసెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు..

డిసెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్ర స్ధాయి మున్సిపల్ కమిషనర్ల వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ వర్క్‌షాపులో వార్డు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, వార్డు కార్యదర్శులకు జాబ్ ఛార్ట్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. స్ధానిక సంస్ధల ఎన్నికలు డిసెంబర్‌లో జరుగుతాయిన తెలిపారు. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో పాలసీమేటర్ ప్రకారం ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. రాబోయే నాలుగైదు నెలల్లో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయన్నారు.

ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు నుంచే గత ప్రభుత్వంలో బిల్లులు విడుదల చేయలేదని ఆరోపించారు మంత్రి బొత్స... అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం స్వచ్ఛ భారత్ తరఫున చేపడతామన్న ఆయన.. 71, 400 మంది వార్డు వాలంటీర్లు, 37 వేలకు పైగా వార్డు సెక్రెటరీలు ఉంటారని.. భారీగా ఉద్యోగాలు ఇవ్వడానికి అధికారులు సహకరించారని తెలిపారు. మరోవైపు సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని.. మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం బాగోలేదనే ఫిర్యాదులు రాకూడదని అధికారులకు ఆదేశించారు.  ఇక, 25 లక్షల మందికి ఉగాదికి ఇళ్లు ఇస్తామన్న బొత్స.. ప్లాన్లు ఇచ్చినప్పుడు మున్సిపల్ లిమిట్ దాటితే వుడాకు వెళ్లడంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ప్రభుత్వానికి కలిగినట్టే భావిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.