దమ్ముంటే.. పోలవరం అవినీతిపై చర్చకు రావాలి

దమ్ముంటే.. పోలవరం అవినీతిపై చర్చకు రావాలి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే పోలవరంపై చర్చకు రావాలని మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. ఈ విషయంపై ఇప్పటికే అనేక సార్లు ఆయనకు ఛాలెంజ్ చేశానని అన్నారు. కొండను తవ్వడం వల్లే మట్టి కదిలి భూమికి పగుళ్లు వచ్చాయని, స్పిల్‌వేకు మూడు కిలోమీటర్లలో మట్టి కుంగితే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జూలైలో పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లనిస్తామని ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై పందాలు కట్టిన వాళ్లు కూడా డబ్బును వెనక్కి తీసేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్షను కూడా ఎన్నికల కమిషన్ అడ్డుకుందని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.