ఎమ్మెల్యేలు కావాలని ఆర్టీసీ యూనియన్ నేతల ప్రయత్నం..!

ఎమ్మెల్యేలు కావాలని ఆర్టీసీ యూనియన్ నేతల ప్రయత్నం..!

టీఎస్ఆర్టీసీ సమ్మె 9వ రోజుకు చేరుకుంది.. అన్ని డిపోల ఎదుట వంటావార్పులతో కార్మికులు ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే. సమ్మె పేరుతో ప్రజలను కొందరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. యూనియన్ నాయకుల వెనుక ఒక్కో రాజకీయ పార్టీ ఉందని, కార్మికుల్లో అంతర్మథనం మొదలైందన్నారు గంగుల. యూనియన్ నేతలు ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నిస్తున్నారని, విలీనంపై సీఎం మేనిఫెస్టోలో పెట్టలేదని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేస్తారా? అని  ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్.