పేదింటి పెళ్లిళ్లకు మేనమామ సీఎం కెసిఆర్

పేదింటి పెళ్లిళ్లకు మేనమామ సీఎం కెసిఆర్

కరీంనగర్ పట్టణంలో 240 మంది లబ్ది దారులకు రూ. 2,37,55,492 విలువైన  కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. నిరుపేదలకు సాయం చేయడం సంతోషంగా ఉంది...పేదింటి పెళ్లిళ్లకు మేనమామగా సీఎం కెసిఆర్ అండగా ఉంటున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు కూడా ప్రభుత్వాలు ఉండేవి కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు...పేద కుటుంబాల్లో బిడ్డ పెండ్లి చేయడానికి ఎంతో కష్టం ఉండేది... అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది అప్పుల పాలయ్యేవారు. కానీ తెలంగాణాలో అలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. దానికి కారణం సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన  కళ్యాణ లక్ష్మి పథకమే నిదర్శనమని వెల్లడించారు. ఏ సంక్షేమ పధకం ప్రవేశ పెట్టినా మహిళలకే అగ్ర తాంబూలం అని పేర్కొన్నారు మంత్రి గంగుల. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ ఉన్న అన్ని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను నాలుగైదు రోజుల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.