రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారు

రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు అని అపధర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం హరీష్ రావు సిద్దిపేట జిల్లా చేర్యాలలో పార్టీ ముఖ్య  కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోవడంపై రాహుల్ గాంధీ నోరు మెదపాలన్నారు. పరిశ్రమల్లో  ఆంధ్రకు ఎలా రాయితీ ఇచ్చావో? తెలంగాణకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చెయ్యడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. రాహుల్ గాంధీ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడు అని అన్నారు.

టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలగా కాపాడుకుంటాం అని హరీష్ రావు అన్నారు. సెంట్రల్ వాటర్ కమీషన్ అధికారులు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పగా ఉందని మెచ్చుకొని పోయారు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ పార్టీ వాళ్ళు తప్పుడు మాటలు ఆపండన్నారు. చేర్యాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు పాటుపడింది. స్టేషన్ ఘనపూర్ మాల్కపూర్ లో నిర్మించాబోయే డ్యామ్ ద్వారా జనగాం ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారనుంది అని హరీష్ రావు తెలిపారు.