టీ-20 మ్యాచ్‌ అదరగొట్టిన మంత్రి హరీష్‌ రావు

టీ-20 మ్యాచ్‌ అదరగొట్టిన మంత్రి హరీష్‌ రావు

మంత్రి హరీష్‌ రావు పేరు తెలియని వారుండరు. ఎందుకంటే హరీష్‌ రావు ఎన్నిక ఎక్కడైనా పార్టీకి గెలుపు అందించడంలో దిట్ట. ఓటమి ఎరగని నాయకుడు. రాజకీయాల్లో ఆయనకు ట్రబుల్‌ షూటర్‌ అని బిరుదు. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నాయకుడు హరీష్‌ రావు. ప్రస్తుతం తెలంగాణ కెబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి. రాజకీయాల్లో నిరంతరం బిజిబిజీగా గడిపే హరీష్‌ రావు.. నిన్న ఓ ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌లో క్రికెటర్‌ అవతారమెత్తారు. మొన్నటి వరకు జీ హెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఫుల్‌ బిజీ గా ఉన్న మంత్రి హరీష్‌ రావు... ఒక్కసారిగా బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. హరీష్‌ సారథ్యం లోని సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్‌కు చెందిన మెడికవర్‌ ఆస్పత్రి మధ్య టీ-20 మ్యాచ్‌ సిద్దిపేటలో జరిగింది. ముందు బ్యాటింగ్‌ చేసిన సిద్దిపేట జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి... 165 పరుగులు చేసింది. సిద్దిపేట జట్టులో 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హరీష్‌ రావు... 12 బంతుల్లో 3 పోర్ల సాయం తో 18 పరుగులు చేశారు. మైదానంలో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ లా బ్యాటింగ్‌ చేసిన హరీష్‌ ను చూసి ప్రేక్షకులు, అభి మానులు కేరింతలు కొట్టారు.