గ్రీన్ చాలెంజ్.. మొక్కలు నాటిన మంత్రి

గ్రీన్ చాలెంజ్.. మొక్కలు నాటిన మంత్రి

తెలంగాణ మ‌ంత్రి జోగు రామ‌న్న చేసిన గ్రీన్ చాలెంజ్ ను మరో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వీక‌రించారు. ఈ గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మామ‌డ మండ‌లం సాంగ్వీ కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయంలో మూడు మొక్క‌లు నాటారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్, ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయ‌క్ లకు గ్రీన్ చాలెంజ్ ను విసిరారు. 'తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడానికి సీఎం కేసీఆర్‌ 'హరితహారం' కార్యక్రమం చేప‌ట్టార‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ తమ వంతుగా మొక్క‌లు నాటాల‌ని' మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సూచించారు.