హైకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు

హైకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా విపక్షాలు బుద్ది తెచ్చుకోవాలని, రాజకీయాల కోసం నిర్వాసితులను రెచ్చగొట్టడం మానుకోవాలని హితువు పలికారు. తెలంగాణలో అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా అడ్డుకోవాల‌ని విప‌క్షాలు చూస్తున్నాయ‌ని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా.. టీఆర్ఎస్ సర్కారు పరిహారం ఇస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వాసితుల‌కు అన్ని విధాలుగా న్యాయం చేస్తుంద‌ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.