ఉత్తమ్ కు మంత్రి జగదీశ్ సవాల్..

ఉత్తమ్ కు మంత్రి జగదీశ్ సవాల్..

నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్, ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి నరసింహరెడ్డి తో కలిసి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్లమెంట్ పరిధిలో సరిగా ఏజెంట్లు కూడా లేరని ఎద్దేవా చేశారు. చివరి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన జోస్యం చెప్పారు. 63 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులని ఆరోపించారు. పవర్ ప్లాంట్ ను అడ్డుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా అని అన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కాదు.. మంచుకోట అని మంత్రి జగదీశ్ విమర్శించారు.