కంటతడిపెట్టిన తెలంగాణ మంత్రి !

కంటతడిపెట్టిన తెలంగాణ మంత్రి !

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి కంటతడిపెట్టుకున్నారు. అనుంగ అనుచరుడు, నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దివంగత కర్నాటి విజయభాస్కర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మంత్రి జగదీష్ రెడ్డి కన్నీటిపర్యంతంగా విలపించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సాయంత్రం పెద్దవూర మండల కేంద్రంలో టిఆర్ఎస్‌ పార్టీ ధూమ్ ధామ్ ను నిర్వహించింది. ఈ సభకు మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, ఉప ఎన్నికల్లో  టిఆర్ఎస్‌ అభ్యర్థి నోముల భగత్ తో పాటు సీనియర్ నేత సి. కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధూమ్ ధామ్ కు ముందు ఇటీవల మరణించిన పెద్దవూర గ్రామ సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేదిక మీద వక్తలు దివంగత కర్నాటి విజయ భాస్కర్ రెడ్డి పనితీరుపై మాట్లాడారు. నేతలు మాట్లాడుతున్న క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి... విజయభాస్కర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు.