లిఫ్ట్‌లో ఇరుకున్న మంత్రి

లిఫ్ట్‌లో ఇరుకున్న మంత్రి

తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డికి ఇవాళ ప్రమాదం తప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా కన్నెపల్లి పంప్‌ హౌస్‌ సందర్శించేందుకు మంత్రి తన అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడ వారంతా ఒకేసారి ఎక్కడంతో లిఫ్ట్‌ స్తంభించిపోయింది. దాదాపు గంటపాటు లిఫ్ట్‌లోనే మంత్రి ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది లిఫ్ట్ అద్దాలు పగులగొట్టి మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.