ఆధార్‌, ఈ కేవైసీ పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఆధార్‌, ఈ కేవైసీ పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం


ఆధార్‌, కేవైసీ పై క్లారిటీ ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఆధార్ అప్‌డేట్‌ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాలల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా ఆధార్, కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేయనంత మాత్రాన రేషన్ సరుకులను తిరస్కరించబోమని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఎక్కడైతే రేషన్‌ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ-కేవైసి చేసుకోవాలని కొడాలి నాని కోరారు. ఇక మరోపక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ కూడా ఆధార్ అప్ డేట్ చేయకుంటే రేషన్ సరుకులు ఆపేస్తారన్న వార్తలో నిజం లేదని తెలిపారు.

ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. ఆధార్ అనుసంధానం కోసం ఎలాంటి గడువు విధించలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులు ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, త్వరలో పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లోనే ఆధార్ అప్ డేట్ చేసేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. ఇందుకోసం పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వ బృందాలే స్వయంగా వెళతాయని పేర్కొన్నారు.