ఇంకా ఎక్కువ తిడతా : కొడాలి నాని

ఇంకా ఎక్కువ తిడతా : కొడాలి నాని

ఏపీ సీఎం జగన్ తిరుమల ఆలయ సన్నిధిలో ప్రవేశించినప్పుడు అన్యమతస్తుడిగా డిక్లరేషన్ పై సంతకం చేయాలనే వ్యాఖ్యలు పెను దుమారానికి కారణం అవుతున్నాయి. దీనిపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రమైన పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఓసారి ఆయన చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి తనదైన శైలిలో స్పందించారు. జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు.  జగన్ తిరుమల వెళ్లడం ఇదేమీ కొత్త కాదని, పాదయాత్రకు ముందు, ఆ తర్వాత కూడా వెళ్లారని అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబేనని, అప్పుడు గుర్తుకు రాని డిక్లరేషన్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని మండిపడ్డారు.

మరోసారి డిక్లరేషన్ గురించి మాట్లాడితే ఈసారి ఇంకా ఎక్కువ తిడతానని హెచ్చరించారు. వెంకన్న తమ కులదైవం అని చెప్పుకునే చంద్రబాబు తన కొడుక్కి, మనవడికి ఎందుకని వెంకన్న పేరు పెట్టలేదని ప్రశ్నించారు. వెంకన్న ఆలయానికి వెళ్లాలంటే టీడీపీ, బీజేపీ సభ్యత్వాలు తీసుకోవాలా?  లేదంటే కమ్మ కులంలో పుడితేనే వెంకన్నను దర్శించుకోవాలా? అని ప్రశ్నించారు. తిరుమల వెంకన్న చౌదరి అంటూ టీడీపీ నేత మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కమ్మ కులంలో పుడితేనే తిరుమలకు వెళ్లాలి అనేట్టున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.