నాని లాజిక్... షాక్ లో లోకేష్... 

నాని లాజిక్... షాక్ లో లోకేష్... 

కొడాలి నాని చంద్రబాబు స్కూల్ నుంచే వచ్చారు. ఆ విషయం అందరికి తెలుసు.  కొన్ని కారణాల వలన నాని వైకాపాకు జై కొట్టి ఆ పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి పదవిని పొందిన సంగతి తెలిసిందే.  మంత్రిగా ఉంటూ తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు.  శాసనసభలో బాబును, శాసనమండలిలో లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు.  తిట్ల వర్షం కురిపించారు.  తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా సెటైర్లు వేస్తూనే... ఓ విషయం గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.  

లోకేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది బాబు కాదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు.  దీంతో అందరు షాక్ అయ్యారు.  దానిపై నాని ఇచ్చిన లాజిక్ దెబ్బకు అందరి కళ్ళు తిరిగిపోయాయి.  అదేమంటే, 1985లో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేస్తే... 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి మండలిని తీసుకొచ్చారని, మండలిలో పెద్దమనుషులు ఉంటె, దాని వలన పరిపాలనలో ఎలాంటి లోపాలు లేకుండా ఉంటాయని అన్నారు.  ఆరోజు రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకురాకుండా ఉంటె, లోకేష్ మంత్రి అయ్యేవారు కాదని, శాసనమండలిలో కూర్చునేవారు కాదని అన్నారు.  మేధావుల కోసం మండలిని ఏర్పాటు చేస్తే, బాబు చెత్తను తీసుకొచ్చి మండలిలో వేస్తున్నారని కొడాలి పేర్కొన్నారు.  కొడాలి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.