అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని బూతు పురాణం

అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని బూతు పురాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బూతులు సర్వ సాధారణం అయిపోయాయి. మంత్రులు సైతం బూతులతో ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడుతూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తాజాగా అసంబ్లీలో కూడా ఏపీ మంత్రి కొడాలి నాని  మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో బూతులతో విరుచుకుపడ్డారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై తెలుగుదేశం పార్టీ చర్చకు పట్టుబట్టింది. సన్నబియ్యం లేదా నాణ్యమైన బియ్యం పంపిణీపై వివరణ ఇస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుపడ్డారు.  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సన్నబియ్యం పంపిణీ చేస్తానని చెప్పి నాణ్యమైన బియ్యం అంటూ మాట మారుస్తున్నారంటూ అధికార పార్టీపై విరుచుకుపడగా కొడాలి నాని తనదైన శైలిలో బూతులతో విరుచుకు పడ్డారు. రామానాయుడును డ్రామానాయుడు కూర్చో అంటూ విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన రామానాయుడు కొడాలి నాని బూతులు తిట్టాడంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు కూడా తిడతా బొచ్చు పీకాలి వచ్చి, నీయమ్మ మొగుడు  అంటూ బూతుల పర్వం అందుకున్నారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అయి ఉండి సభలో బూతులు తిడతారా అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. మంత్రి బూతులు తిడుతున్నా కంట్రోల్ చేయకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాంపై మండిపడ్డారు.