మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం

మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం

రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో జరగనున్న గ్లోబల్ క్లైమెట్ యాక్షన్ సమిట్ లో పాల్గొనాలంటూ ఆహ్వానం అందింది. కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ స్వయంగా  మంత్రి కేటీఆర్ ను ఆహ్వానిస్తూ లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సదస్సుకు హజరుకానున్నారు. వాతావరణ మార్పులకు ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాలపై చేసే ప్రసంగం ఉపయుక్తంగా ఉంటుందని కాలిఫోర్నియా గవర్నర్ లేఖలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం, వాతావరణ అనుకూల కార్యక్రమాలపై వివరించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ను ఆయన కోరారు.