ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మరిన్ని సంస్కరణలు..

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మరిన్ని సంస్కరణలు..

 రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మరిన్ని సంస్కరణలు  తీసుకురానున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపు పై పలు శాఖల అధిపతులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో  ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నూతన సంస్కరణలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. పౌరులకు అన్ని సేవలు ఒకే చోట అందించేందుకు సిటీజన్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌కు మంత్రి ప్రతిపాదన చేశారు. శాఖల పరంగా చేసే సంస్కరణతో ఆయా శాఖల పనితీరులో మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక భవన నిర్మాణ అనుమలులను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రవేశ పెట్టిన టీఎస్‌ బీపాస్‌ చట్టం పై కూడా మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌ బీపాస్‌ అనేది చారిత్రక చట్టమని చెప్పారు. దీని అమలులో వివిధ శాఖల సహకారం , సమన్వయం కూడా తప్పని సరి అన్నారు. సంబంధం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలుచేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.