సార్ చట్టాలు మారుద్దాం...వాళ్ళని చంపేద్దాం సార్ !

సార్ చట్టాలు మారుద్దాం...వాళ్ళని చంపేద్దాం సార్ !

ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టంలో మార్పులు తేవాలని కేటీఆర్‌ ట్విట్టర్‌లో కోరారు. అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని ఆ శిక్షపై మళ్లి సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకుండా ఉండేలా చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. నిర్భయ అత్యాచారం జరిగి ఏడేళ్లైనా నిందితులకు ఉరి పడలేదని అన్నారు. 9 నెలల పాపపై అత్యాచారానికి దిగువ కోర్టు ఉరి వేస్తే హైకోర్టు జీవిత ఖైదుగా మార్చిందని పేర్కొన్నారు. దుమ్ముపట్టిన చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇందుకోసం ఇండియన్ పీనల్ కోడడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ)లను సవరించాలని కోరారు. మోదీజీ.. నిస్సహాయులైన లక్షలాది మంది ప్రజల తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. మన చట్టసభ్యులు ఈ విషయమై స్పందించి.. బాధిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని కోరుతున్నా’నని కేటీఆర్ కోరారు.