న్యాయవాదుల హత్య బాధ కలిగించింది: కేటీఆర్
న్యాయవాది వామన్‌రావు దంపతులు దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న్యాయవాదుల మీద మాకేం ఏం పగ ఉంటుంది..? మమ్మల్ని బూతులు తిట్టిన వారిని క్షమిస్తున్నాం. నడిరోడ్డుపైన ఇద్దరిని చంపినపుడు అంతా బాధపడ్డాం.. ఈ హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుంచి తక్షణమే తొలగించినట్టు తెలిపారు. అదేవిధంగా హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారన్నారు. వామన్‌రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్లు దుయ్యబట్టారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)