కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
కేంద్రం ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలోనూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు మీ గొంతు ఏమైందని రాష్ట్ర బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. లక్షల మంది పిల్లల నోట్లో మట్టి కొట్టారని బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు. నాటి ప్రధాని మన్మోహన్పై మోడీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇష్టానుసారంగా తిడుతున్నారని... తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఎవరూ మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మంత్రి కేటీఆర్.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)